Advertisement

ఖమ్మం జిల్లాలో భార్య వేధింపులు తాళలేక నవ వరుడు ఆత్మహత్య

మన పత్రిక, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో భార్య వేధింపులు మరియు మానసిక అవమానాలు భరించలేక బాణోత్ సదర్‌లాల్ (27) అనే నవ వరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెళ్లయిన మూడు నెలలకే జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, వివాహం జరిగిన కొద్దిరోజులకే దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. తన భార్య నిత్యం ‘మగతనం లేదంటూ’ నిందిస్తూ వేధించేదని కుటుంబీకులు తెలిపారు. ఇటీవల సీత్లా పండుగ కోసం అత్తారింటికి వెళ్లిన సదర్‌లాల్‌ను, అక్కడ భార్య మరియు ఆమె కుటుంబసభ్యులు అందరి ముందు తీవ్రంగా అవమానించారు. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన సదర్‌లాల్, ఇంటికి తిరిగివచ్చే క్రమంలో తన బావకు ఫోన్ చేసి, తాను ఇక బతకలేనని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

పోలీసుల దర్యాప్తు

సదర్‌లాల్ ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. వివాహానికి ముందే ఆ యువతికి మరొకరితో సంబంధం ఉందని, ఆ విషయం బయటపడకుండా ఉండేందుకే సదర్‌లాల్‌పై లేనిపోని నిందలు వేసి వేధించిందని బంధువులు ఆరోపిస్తున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రఘునాథపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, ఈ ఘటనలో భార్య మరియు ఆమె కుటుంబసభ్యుల ప్రమేయంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Advertisement