మన పత్రిక వెబ్‌డెస్క్, ఖమ్మం: ఖమ్మం జిల్లా కలెక్టర్ (Khammam collector) , యువ ఐఏఎస్ అధికారి అనుదీప్ దురిశెట్టిని అరుదైన గౌరవం వరించింది. విద్యా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన బిట్స్ పిలాని (BITS Pilani) అందజేసే ‘యంగ్ అలుమ్ని అచీవ్ మెంట్ అవార్డు – 2026’కు ఆయన ఎంపికయ్యారు.
మంత్రి చేతుల మీదుగా.. శనివారం హైదరాబాద్‌లోని బిట్స్ పిలాని క్యాంపస్‌లో జరిగిన గ్లోబల్ మీట్ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి చేతుల మీదుగా కలెక్టర్ అనుదీప్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు.
ఎంపిక ఎందుకంటే? యువ వయసులోనే అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రజాసేవలో వినూత్న ఆలోచనలతో పరిపాలన కొనసాగిస్తున్నందుకు గాను బిట్స్ పిలాని అలుమ్ని రిలేషన్స్ కమిటీ ఆయన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఈ ఆనందకర క్షణాలను కలెక్టర్ అనుదీప్ తన సతీమణి మాధవి, ఇతర కుటుంబ సభ్యులతో పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
