మన పత్రిక వెబ్‌డెస్క్, మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలు పతాక స్థాయి ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టకపోవడంతో ఫలితాలు ‘టై’గా ముగిశాయి. దీంతో మున్సిపల్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ నెలకొన్న పరిణామం సినిమా క్లైమాక్స్‌ను తలపిస్తోంది.
మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులు ఉండగా, ఫలితాలు ఇరు ప్రధాన పార్టీల మధ్య సమానంగా పంపిణీ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ 8 వార్డుల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ కూడా 8 వార్డుల్లో గెలుపొందింది. మ్యాజిక్ ఫిగర్ 9 కాగా, ఏ పార్టీ కూడా ఆ సంఖ్యను అందుకోలేకపోయింది. దీంతో ఇక్కడ చైర్మన్ ఎన్నిక అత్యంత కీలకంగా మారింది.
ప్రస్తుత పరిస్థితుల్లో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకోవడంలో ఎక్స్-అఫీషియో (Ex-officio) ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాయి. ఎవరికి ఎక్కువ ఎక్స్-అఫీషియో ఓట్లు ఉంటే వారికే చైర్మన్ గిరీ దక్కే అవకాశం ఉంది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీలు పీఠాన్ని దక్కించుకునేందుకు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. క్యాంపు రాజకీయాలకు తెరలేపే అవకాశం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్‌తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
