Karishma Sharma News: బాలీవుడ్ నటి కరిష్మా శర్మ తీవ్ర ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్‌కు వెళ్లేందుకు చర్చి గేట్ రైల్వే స్టేషన్ వద్ద రైలు ఎక్కారు. ఆమెతో పాటు వచ్చిన స్నేహితురాలు రైలు మిస్ అయ్యింది. ఆ సమయంలో ఉద్విగ్నతలో కరిష్మా కదులుతున్న రైలు నుండి దూకేశారు. ఈ ఘటనలో ఆమెకు తల మరియు వీపుకు తీవ్ర గాయాలయ్యాయి.
అయితే ప్రాణాపాయం లేకపోవడం కొంచెం ఉపశమనం. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించాలని కోరారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ఆమె త్వరితగతిన కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.
కరిష్మా 2014లో ‘పవిత్ర రిస్తా’ సీరియల్ ద్వారా ప్రసిద్ధి చెందారు. ఆ తర్వాత ‘సూపర్ 30’, ‘ఏక్ విలన్ రిటర్న్స్’ వంటి సినిమాల్లో నటించారు. ‘రాగిణి MMS రిటర్న్స్’ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టీవీ, సినిమా, వెబ్ సిరీస్ లతో పాటు మ్యూజిక్ వీడియోస్ లో కూడా పాపులర్. ఇప్పటివరకు కరిష్మా ఎలాంటి తెలుగు సినిమా చేయలేదు. ప్రస్తుతం ఆమె పూర్తి స్థాయిలో బిజీగా ఉన్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

