మన పత్రిక, వెబ్‌డెస్క్: కరీంనగర్‌లో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శనివారం నగరంలోని కమాన్ ప్రాంతంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ కుమారస్వామి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు.
Advertisement
ఈ తనిఖీల్లో భాగంగా, భారీగా జరిమానాలు బకాయి ఉన్న ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గణేష్ నగర్‌కు చెందిన కట్కోజువాల కిరణ్ కుమార్ అనే వ్యక్తి హోండా షైన్ (TS22 7090) బైక్‌పై రాంగ్ రూట్‌లో వస్తుండగా పట్టుబడ్డాడు.
Advertisement
వాహనాన్ని తనిఖీ చేయగా, దానిపై 120 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తేలింది. ఈ చలాన్ల మొత్తం విలువ రూ. 29,560గా గుర్తించారు. దీంతో వాహనాన్ని సీజ్ చేసి, తదుపరి చర్యల కోసం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

