మన పత్రిక, వెబ్‌డెస్క్: కరీంనగర్ జిల్లాలో ఎన్నికల వేళ కలకలం రేగింది. శంకరపట్నం మండలం మొలంగూర్‌లో సర్పంచ్ అభ్యర్థి కొమురయ్యపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
దుండగులు పక్కా ప్లాన్ ప్రకారం.. కొమురయ్యను గుర్తుపట్టకుండా ఉండేందుకు ముందుగా ఆయన కళ్లలో కారం పొడి చల్లి, ఆపై దాడికి తెగబడ్డారు. ఊహించని పరిణామంతో బాధితుడు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కొమురయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
