మన పత్రిక, వెబ్‌డెస్క్: మృతుడు మంకమ్మతోటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ ( Doctor srinivas ) , గతంలో చొప్పదండి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన భార్య విప్లవశ్రీ కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలుగా పనిచేస్తున్నారు. భర్త ఆత్మహత్యపై డాక్టర్ విప్లవశ్రీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కరుణాకర్, కిరణ్, గణేష్ అనే ముగ్గురు స్నేహితులతో కలిసి తన భర్త ‘మెటా ఫండ్’లో డబ్బులు పెట్టారని, వారికి కోట్లలో డబ్బులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. వైద్యవృత్తిలో ఉండటంతో శ్రీనివాస్ పేరుపై బ్యాంక్ రుణాలు తీయించి, పలురకాల బిజినెస్‌లలో వారు డబ్బులు పెట్టించి మోసం చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ మోసం కారణంగా శ్రీనివాస్‌కు సుమారు మూడు కోట్ల రూపాయల వరకు అప్పులు అయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని బంధువులు తెలిపారు. తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ ఉద్యోగులు తరచూ ఇంటికి రావడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని, స్నేహితులు డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

