Advertisement

Mid-day meal |  విద్యార్థులకు అస్వస్థత

మన పత్రిక, వెబ్​డెస్క్ : కామారెడ్డి జిల్లా, బిచ్కుంద మండలంలోని షెట్లూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం (మిడ్-డే మీల్) వికటించడంతో 28 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధిత విద్యార్థులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

kamareddy mid day meal food poisoning

ఈ ఘటనపై జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆసుపత్రికి వెళ్లి బాధిత విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

Advertisement

ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement