Advertisement

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: నామినేషన్లు ఆరంభం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత 15న, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 17న నామినేషన్లు వేస్తారని సమాచారం. బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి ఖరారైనట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ చివరి తేదీ. అదే రోజు సాయంత్రం తుది అభ్యర్థుల జాబితా విడుదల. నవంబర్ 11న పోలింగ్, 14న యూసఫ్‌గూడలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Advertisement

3.98 లక్షల మంది ఓటర్లు – పురుషులు 2.07 లక్షలు, స్త్రీలు 1.91 లక్షలు. ఈ ఉపఎన్నిక ప్రజా ఆదరణ సూచికగా మారుతోంది. మూడు పార్టీలూ గట్టిగా ఫోకస్ చేస్తున్నాయి.

Advertisement