మన పత్రిక, వెబ్డెస్క్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం సూచనలతో, నియోజకవర్గ పరిధిలోని 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు.
Advertisement
వీరిలో అత్యధికంగా బోరబండ ఏరియా నుంచి 74 మంది ఉండటం గమనార్హం. రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, పోలీసులు బైండోవర్ చేసిన వారిలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్, ఆయన సోదరుడు రమేశ్ యాదవ్ కూడా ఉన్నారు.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

