Advertisement
Jogi Ramesh Arrest

Jogi Ramesh Arrest: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్! ఏ1 వాంగ్మూలంతో..

మన పత్రిక, వెబ్​డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన నకిలీ (jogi ramesh liquor case) మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో సెర్చ్ వారెంట్ అందజేసిన అనంతరం అదుపులోకి తీసుకుని, ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు.

Advertisement

ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే జోగి రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. “జోగి రమేష్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశాను, ఆర్థికంగా సాయం చేస్తానని హామీ ఇచ్చి పట్టించుకోలేదు” అని జనార్ధన్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం.

Advertisement

రమేష్ ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారని జోగి రమేష్ ఆరోపించారు. అరెస్ట్ సమయంలో ఆయన ఇంటి వద్ద వైసీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement