Advertisement

కాంగ్రెస్ లో ముదిరిన వర్గ పోరు.. ఎమ్మెల్యే సంజయ్ పై జీవన్ రెడ్డి ఫైర్

మన పత్రిక వెబ్​డెస్క్, జగిత్యాల: జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. మాజీ మంత్రి, సీనియర్ నేత జీవన్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పార్టీలో కొత్తగా చేరిన వారు పెత్తనం చెలాయించాలని చూస్తే సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు.

ప్రభుత్వ విధానాలకు మద్దతు తెలిపితే స్వాగతిస్తామని, అంతేకానీ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో, టికెట్ల పంపకాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకోబోమని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. వలస నేతల ఆధిపత్యాన్ని అంగీకరించేది లేదని ఆయన తేల్చి చెప్పారు.

Advertisement
Advertisement