WhatsApp
Advertisement

ఢిల్లీలో ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ట్రంప్ కు స్ట్రాంగ్ కౌంటర్!

మన పత్రిక వెబ్​డెస్క్, న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతున్న వేళ, ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి సయ్యద్ ఖతీబ్‌జాదా భారత్ పర్యటన తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జరిగిన అయతుల్లా అలీ ఖమేనీ సంతాప సభకు, అలాగే ‘రైసీనా డైలాగ్‌’కు ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఖతీబ్‌జాదా మాట్లాడుతూ.. ఇరాన్ కొత్త నాయకత్వాన్ని తామే నిర్ణయిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్రీలంక తీరంలో తమ నిరాయుధ నౌకను పేల్చివేసి అమెరికా క్షమించరాని నేరం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

Advertisement

యుద్ధంలో తటస్థ వైఖరి అవలంబిస్తున్న భారత్ వేదికగా ఇరాన్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం గ్లోబల్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో ఇప్పట్లో శాంతి నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు.

Advertisement