Advertisement

TG INTER EXAMS 2026 | ఇంటర్ పరీక్షలు జనవరిలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2026 జనవరిలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెడియట్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి సమాలోచనలు జరుగుతున్నాయి.

Advertisement

Telangana Inter exams in January 2026.

ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నిర్వహించేవి. కొత్త నిర్ణయంతో పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. దీని వల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్, సీయూఈటీ యూజీ వంటి ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని కొందరు విద్యా నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ మార్పు విద్యార్థులపై ఎక్కువ ఒత్తిడి తీసుకురావచ్చని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు ముందుకు రావడంతో చివరి నిమిషంలో ప్రిపరేషన్ ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయం చివరిగా ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. విద్యార్థుల సంపూర్ణ సిద్ధత, పరీక్షల షెడ్యూల్ పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement