ఇంటెల్లెజెన్స్ బ్యూరో మరియు భారత ప్రభుత్వం అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్- II 258 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసి ఉన్నారు. మొత్తం కంప్యూటర్ సైన్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో 90 పోస్టులకు గాను, మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ గాను 168 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇంజనీరింగ్ లో B.E/ B.Tech పాస్ అయితే చాలు.
ఈ పోస్టులను అప్లై చేసుకోవడానికి వయోపరిమితి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు నిర్ణయించారు. ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి 25 అక్టోబర్ 2025 నుంచి 16 నవంబర్ 2025 వరకు లింక్ ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఉద్యోగానికి ఎంపిక విధానం రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఉంటుంది ఇంకా సదరు ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో GATE స్కోర్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
పరీక్ష రుసుము 100/- మాత్రమే ఇంకా ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది లింక్ ను అనుసరించగలరు. www.mha.gov.in , www.ncs.gov.in.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

