ప్రతి ఇంటి నిర్మాణానికి 90 రోజుల పాటు ఉపాధి హామీ పనులు జరుపుకోవచ్చు. బేస్‌మెంట్ వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 రోజులు పనులు చేయొచ్చు. ప్రస్తుతం రోజుకు రూ.307 కూలీ చెల్లిస్తున్నారు. 90 రోజులకు గాను రూ.27,630 వరకు లబ్ధి లభిస్తుంది. ఎంపీడీవోలు అర్హుల జాబితా తయారు చేసి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నుంచి అనుమతి తీసుకోవాలి.
ఆ తర్వాత జాబితాను గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌కు పంపాలి. నిర్మాణ పనులు మాత్రమే చేపట్టాలి. ఇతర పనులు చేయొద్దని పంచాయతీరాజ్ శాఖ స్పష్టం చేసింది. పని ప్రగతిపై మూడు స్థాయిల్లో ఫొటోలు లబ్ధిదారుతో కలిపి అప్‌లోడ్ చేయాలి. పని పూర్తయిన తర్వాత పంచాయతీ కార్యదర్శి ధృవీకరించి చెల్లింపులకు అనుమతించాలి. చెల్లింపు వివరాలు పంచాయతీ బోర్డుపై ప్రదర్శించాలి. లబ్ధిదారుల జాబితాతో రిజిస్టర్ తయారు చేసి సామాజిక తనిఖీలకు సమర్పించాలి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
