మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పథకానికి శ్రీకారం చుట్టింది. ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్ట్ (indira dairy scheme)’ పేరుతో డెయిరీ బిజినెస్ చేసే మహిళలకు భారీ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ పథకం కింద రూ. 2 లక్షల విలువైన రెండు గేదెలను అందిస్తారు. ఇందులో 70 శాతం (రూ. 1.4 లక్షలు) ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుండగా, మిగిలిన మొత్తం బ్యాంక్ రుణంగా ఉంటుంది. పశుగ్రాసం, షెడ్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వమే సాయం చేస్తుంది.
దీని ద్వారా ఖర్చులు పోను నెలకు రూ. 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఆదాయం పొందవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్, మధిరలో పైలట్ ప్రాజెక్టుగా ఇది అమలవుతోంది. త్వరలోనే రూ. 781 కోట్ల బడ్జెట్‌తో ఈ స్కీమ్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
