Advertisement

Train Ticket Hike: కొత్త ధరలు.. ఎవరికి మినహాయింపు?

మన పత్రిక, వెబ్​డెస్క్: రైలు ప్రయాణికులకు చేదు వార్త. రైల్వే టికెట్ ఛార్జీలను (Train Ticket Fares) స్వల్పంగా పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే, స్వల్ప దూర ప్రయాణికులకు మాత్రం ఊరట లభించింది.

పెంపు వివరాలు ఇలా:

Advertisement
  • మినహాయింపు: 215 కిలోమీటర్ల లోపు ప్రయాణించే వారికి, సబ్ అర్బన్ రైళ్లలో సీజన్ టికెట్లకు పెంపు వర్తించదు.
  • పెంపు: 215 కిలోమీటర్లు దాటి ప్రయాణించే వారికి..
    • సాధారణ తరగతి (Ordinary Class) బోగీల్లో కిలోమీటర్‌కు 1 పైసా.
    • నాన్ ఏసీ ఎక్స్‌ప్రెస్, మెయిల్, అన్ని ఏసీ క్లాసుల్లో (AC Class) కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెంచారు.

ఈ పెంపు ద్వారా 2026 మార్చి నాటికి రూ. 600 కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని రైల్వే అంచనా వేస్తోంది.

Advertisement