భారత ప్రభుత్వం మరియు రైల్వే మంత్రిత్వ శాఖ డిగ్రీ లేదా డిప్లొమో అయిన అభ్యర్ధులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులు అన్ని కలిపి మొత్తం 2570 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసివున్నారు. అప్లై చేయడానికి వయో పరిమితి 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉంది. అర్హులైన అభ్యర్ధులు ఆన్లైన్ లో అక్టోబర్ 31, 2025 నుండి నవంబర్ 30, 2025 వరకు అప్లై చేసుకోగలరు.
ఆన్లైన్ లో అప్లై చేయడానికి SC/ST/ PwBD అభ్యర్ధులకు రుసుము 250 రూపాయలు మరియు ఇతర కేటగిరి అభ్యర్ధులకు రుసుము 500 రూపాయలు.ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లై చేసుకావాలనుకుంటే వివిధ అప్లికేషన్స్ పూర్తిచేయవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు Computer based exam& Skill test ద్వారా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి పోస్టు నీ బట్టి నెల జీతం 35,400 నుంచి ఉంటుంది.
ఇంకా ఇతర ముఖ్యమైన విషయాల కొరకు ఒకసారి ఈ క్రింది వెబ్సైట్ ను తరచూ సందర్శించగలరు.https://Indianrailways.gov.in
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

