మన పత్రిక, హైదరాబాద్: భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు (Bullet Train) సేవలను 2027 ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అధికారికంగా ప్రకటించారు. ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ రైల్ కారిడార్లో భాగంగా సూరత్-బిలిమోరా మార్గంలో ఈ రైలు సేవలు మొదట అందుబాటులోకి రానున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ మరియు ట్రాక్ పనులు ఇప్పటికే 80 శాతం మేర పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ కేంద్రంగా పుణె, చెన్నై మరియు బెంగళూరు నగరాలను కలుపుతూ మూడు కొత్త బుల్లెట్ ట్రైన్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే నవ్-నిర్మాణ్ (Nav-Nirman) పథకం కింద తెలంగాణలోని సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ స్టేషన్లను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

Rohith is a Chief Editor with 3 years of experience in writing news articles on topics like education, jobs, and politics clear, and engaging stories that are easy to understand and hold the reader’s interest making complex topics accessible and relatable to a larger audience.
