Advertisement

CP Sajjanar | ఐబొమ్మ సీపీ సజ్జనార్‌తో చిరంజీవి, రాజమౌళి భేటీ!

మన పత్రిక, వెబ్​డెస్క్: సినీ పరిశ్రమను కుదిపేసిన ‘ఐబొమ్మ’ (iBomma) వెబ్‌సైట్ నిర్వాహకుడు రవి అరెస్ట్ వ్యవహారం టాలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న రవిని మరింత లోతుగా విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో సినీ అగ్ర ప్రముఖులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), నాగార్జున (Nagarjuna), దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli), నిర్మాతలు దిల్ రాజు, దగ్గుబాటి సురేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు. పైరసీ భూతాన్ని అరికట్టడంలో పోలీసులు చూపిన చొరవను, వారి సమర్థవంతమైన పనితీరును ఈ సందర్భంగా సినీ పెద్దలు ప్రశంసించారు.

Advertisement
Advertisement