మన పత్రిక, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 6న షెడ్యూల్ విడుదల కాగా, అక్టోబర్ 13న అధికారిక నోటిఫికేషన్ జారీతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీని కారణంగా అదే రోజున జరగాల్సిన ప్రజావాణితో పాటు అన్ని ప్రజా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఆదివారం సాయంత్రంతో కోడ్ ముగియడంతో నేటి నుంచి ప్రజావాణి తిరిగి పునఃప్రారంభమవుతోంది.
హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి సాధారణంగా ప్రజల నుంచి విస్తృత స్పందన లభిస్తోంది. గత నెల 6న జరిగిన చివరి ప్రజావాణికి మొత్తం 206 ఫిర్యాదులు అందాయి. అదనపు కలెక్టర్ జి. ముకుందరెడ్డి సమక్షంలో జరిగిన ఆ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
వీటిలో గృహనిర్మాణ సంబంధిత ఫిర్యాదులు 98 ఉండగా, అందులో రెండు పడకల గదుల ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఎక్కువగా ఉన్నాయి. రెవెన్యూ శాఖకు 46, పెన్షన్‌కు 26, ఇతర శాఖలకు 36 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు. నెలరోజుల విరామం అనంతరం మళ్లీ ప్రారంభమవుతున్న ఈ రోజు ప్రజావాణికి ఎక్కువ సంఖ్యలో ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
