మన పత్రిక, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర (2026) వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఆంక్షలు కఠినతరం చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు నగరవ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా నిన్న ఒక్క రాత్రే రికార్డు స్థాయిలో 304 వాహనాలను (కార్లు, బైకులు) సీజ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మద్యం సేవించి వాహనం నడిపితే రూ. 10,000 జరిమానా, ఆరు నెలల జైలు శిక్ష తప్పదని అధికారులు హెచ్చరించారు. నేరం తీవ్రతను బట్టి డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దవుతుందని స్పష్టం చేశారు. వేడుకల సమయంలో క్యాబ్ సేవలను వినియోగించుకోవాలని, ప్రమాద రహితంగా కొత్త ఏడాదికి స్వాగతం పలకాలని పోలీసులు నగరవాసులకు సూచించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
