మన పత్రిక, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో నవంబరు నెలకు సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీకి పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బియ్యం స్టాకును ఇప్పటికే రేషన్ షాపులకు తరలించినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్ తెలిపారు.
జిల్లా పరిధిలో మొత్తం 7,98,269 రేషన్‌కార్డులు ఉండగా, 30,42,056 మంది లబ్దిదారులు ఉన్నారు. నవంబర్ నెలకు గాను 17,102 టన్నుల సన్న బియ్యాన్ని కేటాయించారు. మొదటి విడతగా 8,500 టన్నుల బియ్యాన్ని నగరంలోని 653 రేషన్ షాపులకు పంపించారు. సన్న బియ్యంతో పాటు, జీహెచ్ఎంసీ పరిధిలో 3,400 టన్నుల గోధుమలను కూడా ఈ నెల పంపిణీ చేస్తున్నామని అధికారి శ్రీనివాస్ వెల్లడించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
