Advertisement

డ్రగ్స్ కలకలం.. ఆరుగురు అరెస్ట్, కొకైన్ సీజ్.

మన పత్రిక, వెబ్​డెస్క్: నూతన సంవత్సర వేడుకల (New Year Celebrations) వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఏటా డిసెంబర్-జనవరి మధ్యలోనే 80-90 శాతం మత్తు దందా జరుగుతుందన్న సమాచారంతో నిఘా పెంచారు. ఈ క్రమంలో తెలంగాణ ‘ఈగల్ టీమ్’ పోలీసులు ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 330 గ్రాముల గంజాయి, 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు.

అటు వరంగల్ జిల్లాలో ముగ్గురు సరఫరాదారులను అరెస్ట్ చేసి 80 గ్రాముల గంజాయిని, మియాపూర్ పరిధిలో 250 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడిన వారు ఏపీ, తెలంగాణ మధ్య గంజాయి సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా సభ్యులుగా పోలీసులు గుర్తించారు.

Advertisement
Advertisement