హైదరాబాద్‌లోని నల్లకుంటలో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. కట్టుకున్న భార్యపై అనుమానంతో ఓ కిరాతక భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశాడు. ఈ కేసులో పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్‌ను పోలీసులు ఘటన జరిగిన 12 గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన వెంకటేష్, త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
గత కొంతకాలంగా భార్యపై అనుమానంతో వెంకటేష్ వేధించేవాడు. గొడవల కారణంగా పుట్టింటికి వెళ్లిన త్రివేణిని నమ్మించి నగరానికి తీసుకొచ్చిన వెంకటేష్, బుధవారం (డిసెంబర్ 24) అర్ధరాత్రి ఆమెపై దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన త్రివేణిని స్థానికులు ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
