WhatsApp
Advertisement

ఫ్రీగా రూ.5 వేలు వస్తున్నాయా? ఆ లింక్ క్లిక్ చేశారో ఇక అంతే!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: పండుగలు, ప్రత్యేక దినోత్సవాల వేళ ప్రజల ఆనందాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. తాజాగా సంక్రాంతి, రాబోయే గణతంత్ర దినోత్సవాల (Republic Day) పేరుతో సోషల్ మీడియాలో భారీ మోసం జరుగుతోందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. వాట్సాప్‌లో “ఫోన్ పే రిపబ్లిక్ డే మెగా గిఫ్ట్”, “సంక్రాంతి కానుక” అంటూ కొన్ని నకిలీ లింకులు చక్కర్లు కొడుతున్నాయని, వాటిని క్లిక్ చేస్తే రూ. 5,000 ఉచితంగా వస్తాయని ఆశపెడుతున్నారని తెలిపారు.

ఆ ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. సైబర్ నేరగాళ్లు ప్రజలను బుట్టలో వేయడానికి సైకలాజికల్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని సజ్జనార్ వివరించారు.

Advertisement
  • ట్రిక్: “మొదట ఇది నకిలీ అనుకున్నాను, కానీ నిజంగానే నాకు రూ. 5,000 వచ్చింది! మీరు కూడా ప్రయత్నించి చూడండి!” అంటూ నమ్మించే మెసేజ్‌లను సర్క్యులేట్ చేస్తున్నారు.
  • డేంజర్ లింక్స్: ఈ మెసేజ్‌ల చివరన http://fdgc.lusvv.xyz లేదా http://iom.qmtyw.xyz వంటి వింత అక్షరాలతో కూడిన లింకులు ఉంటున్నాయి. ఇవి అధికారిక లింకులు కావని గ్రహించాలి.
  • ప్రమాదం: ఆశపడి ఆ లింక్‌పై క్లిక్ చేస్తే.. మీ ఫోన్‌లోకి ప్రమాదకరమైన మాల్వేర్ ప్రవేశిస్తుంది. తద్వారా మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ పిన్, పాస్‌వర్డ్‌లు చోరీకి గురై, క్షణాల్లో బ్యాంక్ ఖాతా ఖాళీ అవుతుంది.

ఏం చేయాలి? ఫోన్ పే, గూగుల్ పే వంటి ఏ సంస్థా వాట్సాప్ లింకుల ద్వారా డబ్బులు పంచదని, ఏ ఆఫర్ ఉన్నా అది వారి అధికారిక యాప్‌లోనే కనిపిస్తుందని సీపీ స్పష్టం చేశారు. అనధికారిక లింక్‌లను క్లిక్ చేయవద్దని సూచించారు. ఒకవేళ ఎవరైనా మోసపోయినట్లయితే వెంటనే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని లేదా http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని కోరారు.

Advertisement