Advertisement

HYD: ‘పెద్ది’ మరోసారి వాయిదా..?

మన పత్రిక, సినిమా: పెద్ది విడుదలపై మరోసారి గందరగోళం నెలకొంది. సోషల్ మీడియాలో ఈ సినిమా జూన్ 26కు వాయిదా పడిందన్న ప్రచారం జోరుగా సాగింది. నిర్మాత ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూర్చాయి. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జూన్ 26న చెన్నై లవ్ స్టోరీ విడుదల చేయాలని భావించామని, అయితే అదే రోజున ‘పెద్ది’ రిలీజ్ ఉందని తెలుసుకుని తమ సినిమా తేదీని వాయిదా వేసుకున్నామని చెప్పారు.

అయితే తర్వాత ఎస్కేఎన్ తన వ్యాఖ్యలను సవరించారు. తాను పొరపాటున అలా చెప్పానని స్పష్టం చేశారు. సాయి రాజేశ్‌తో మాట్లాడిన సందర్భంలో సోషల్ మీడియాలో వచ్చిన ట్వీట్ల ఆధారంగా ‘పెద్ది’ జూన్ 26న వస్తుందేమో అనుకుని మాట్లాడానని వివరించారు. అసలు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన ఏదీ లేదని, తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవద్దని తెలిపారు. దీంతో ‘పెద్ది’ వాయిదాపై స్పష్టత ఇంకా రాలేదు.

Advertisement

ఇదిలా ఉండగా లెనిన్ పరిస్థితి కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా ముందుగా మే 1న రావాల్సి ఉండగా, ‘పెద్ది’ ఏప్రిల్ 30న వస్తుందన్న కారణంతో జూన్ 26కు మార్చారు. ఇప్పుడు ‘పెద్ది’ వాయిదా వార్తలతో ‘లెనిన్’ మళ్లీ పాత తేదీకి వస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో చిన్న సినిమాలు కూడా విడుదల తేదీలపై కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.

Advertisement