మన పత్రిక, వెబ్‌డెస్క్: హుజురాబాద్ మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది (3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL). విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలకు మద్యం సేవించి రావడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పీఈటీ, ఫిజికల్ సైన్స్ టీచర్, అలాగే చెల్పూర్ పాఠశాలకు చెందిన మరో ఫిజికల్ సైన్స్ టీచర్ ఉన్నారు. హుజురాబాద్ టీచర్లు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరో ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడం, విద్యార్థులను నిరుత్సాహపరచడం వంటి చర్యలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పదేపదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇవి కూడా చదవండి :
- బెంగాల్లో మమతా బెనర్జీ ఓటమి.. బీజేపీ ఘనవిజయం
- TVK Vijay : విజయ్ సీఎం గెలుపుతో కోలీవుడ్‌లో భారీ మార్పులు
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
