మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: Telangana Pending Bills.. రాష్ట్రంలో ఉద్యోగుల పెండింగ్ బిల్లుల వ్యవహారం మరోసారి వేడెక్కింది. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వ జాప్యంపై ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్నే హెచ్చరిస్తూ సంచలన ప్రకటన చేశారు. మార్చి 1వ తేదీలోగా సమస్యను పరిష్కరించకపోతే ఉద్యమ బాట పడతామని అల్టిమేటం జారీ చేశారు.
మార్చి 2 నుంచి దీక్ష ఉద్యోగుల పెండింగ్ బిల్లులను మార్చి 1వ తేదీలోగా క్లియర్ చేయాలని వెంకట్రామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే.. మార్చి 2వ తేదీ నుంచి నిరాహార దీక్ష (Hunger Strike) చేపడతానని స్పష్టం చేశారు. ఇది కేవలం హెచ్చరిక కాదని, ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని అన్నారు.
ఆమరణ దీక్షకు సిద్ధం.. పెన్ డౌన్ తప్పదు! నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం దిగిరాకపోతే, దాన్ని ఆమరణ నిరాహార దీక్షగా మారుస్తానని వెంకట్రామిరెడ్డి తేల్చిచెప్పారు. తాము ఆమరణ దీక్షకు దిగితే.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు కూడా మద్దతుగా నిలిచే అవకాశం ఉందన్నారు.
- ఉద్యోగులు ‘పెన్ డౌన్’ (Pen Down) చేసి విధులను బహిష్కరిస్తే ప్రభుత్వ కార్యకలాపాలు ఎక్కడికక్కడ స్తంభించిపోతాయని హెచ్చరించారు.
- పరిపాలన ఆగిపోతే ప్రజా వ్యవస్థ చిన్నభిన్నమవుతుందని, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.
- ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ సర్కార్.. ప్రజల గురించి, ఉద్యోగుల గురించి ఆలోచించి తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మార్చి 2 నుంచి చేపట్టబోయే దీక్షపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తెలపకపోతే, వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన మీడియా ముఖంగా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
