Advertisement

ఆర్టీవో చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఇంట్లో నుంచే డ్రైవింగ్ లైసెన్స్!

మన పత్రిక, వెబ్​డెస్క్: వాహనదారులకు శుభవార్త. డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) కోసం ఇకపై గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేసింది. ఆధార్ కార్డు ఉంటే చాలు, లెర్నర్ లైసెన్స్ (LL) కోసం ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం ఇలా:

Advertisement
  • వెబ్‌సైట్: ముందుగా parivahan.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ‘ఆన్‌లైన్ సర్వీసెస్’లో ‘డ్రైవింగ్ లైసెన్స్ రిలేటెడ్ సర్వీసెస్’ ఎంచుకోవాలి.
  • ఆధార్ ప్రామాణికత: రాష్ట్రాన్ని ఎంచుకున్న తర్వాత, ‘అప్లై ఫర్ లెర్నర్ లైసెన్స్’ పై క్లిక్ చేసి, ఆధార్ ద్వారా వివరాలను ధృవీకరించాలి.
  • ఆన్‌లైన్ పరీక్ష: ఫారమ్ నింపి, ఫీజు చెల్లించిన తర్వాత ఆన్‌లైన్‌లోనే లెర్నర్ లైసెన్స్ పరీక్ష రాయవచ్చు. ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్‌పై ఉండే ఈ పరీక్షలో పాస్ అయితే లెర్నర్ లైసెన్స్ జారీ అవుతుంది.

ముఖ్య గమనిక: లెర్నర్ లైసెన్స్ వచ్చిన తర్వాత, నిర్ణీత గడువులోగా డ్రైవింగ్ ప్రాక్టీస్ చేసి, శాశ్వత లైసెన్స్ (Permanent DL) కోసం మాత్రం తప్పనిసరిగా ఆర్టీవో (RTO) కార్యాలయానికి వెళ్లి డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.

Advertisement