Advertisement

స్కూళ్లకు 3 రోజులు సెలవులు..

మన పత్రిక, వెబ్​డెస్క్: క్రిస్మస్ పండుగ (Christmas) సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి. రేపటి (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు సెలవుల సందడి నెలకొననుంది. అయితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెలవుల విధానంలో చిన్న తేడా ఉంది.

తెలంగాణలో సెలవులు:

Advertisement
  • డిసెంబర్ 24 (బుధవారం): క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ‘ఆప్షనల్ హాలిడే’ (Optional Holiday).
  • డిసెంబర్ 25 (గురువారం): క్రిస్మస్ పండుగ – ‘జనరల్ హాలిడే’ (General Holiday).
  • డిసెంబర్ 26 (శుక్రవారం): బాక్సింగ్ డే (Boxing Day) సందర్భంగా ప్రభుత్వం ‘జనరల్ హాలిడే’ ప్రకటించింది. దీంతో వరుసగా రెండు రోజులు (25, 26) రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు, ఆఫీసులకు సెలవు ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సెలవులు:

  • డిసెంబర్ 24 & 26: ఈ రెండు రోజులు ‘ఆప్షనల్ హాలిడేస్’గా ప్రభుత్వం ప్రకటించింది.
  • డిసెంబర్ 25: క్రిస్మస్ సందర్భంగా ‘జనరల్ హాలిడే’ ఉంటుంది.

గమనిక: జనరల్ హాలిడే రోజున అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, స్కూళ్లు మూసివేస్తారు. ఆప్షనల్ హాలిడే రోజున సెలవు ఇవ్వాలా? వద్దా? అనేది ఆయా సంస్థల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

Advertisement