Panchayat Elections : త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.
జీవో 46 ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవో 46కు విరుద్ధంగా 17 శాతం కూడా మించకుండా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలు ఉండగా, కేవలం 117 స్థానాలకు మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరుపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పంచాయతీ ఎన్నికలు యథావిధిగా జరగనున్నాయి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
