Advertisement

ఫోన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట

ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు బిగ్ రిలీఫ్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు!

మన పత్రిక వెబ్​డెస్క్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనను విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని, ఈ కేసులో తదుపరి విచారణ అవసరం లేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement

గతంలో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో ఎఫ్ఐఆర్ ను హైకోర్టు మార్చి 2025లో కొట్టివేసిన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా, తాజాగా ప్రభుత్వానికి చుక్కెదురైంది. తాజా తీర్పుతో ఈ వ్యవహారానికి తెరపడినట్లయింది.

Advertisement