మన పత్రిక, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) శీతాకాల సమావేశాల నిర్వహణ తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన బీఏసీ (BAC) సమావేశం అనంతరం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించేందుకు అసెంబ్లీని కనీసం 15 రోజుల పాటు నడపాలని డిమాండ్ చేశారు.
నీటిపారుదల రంగంపై ప్రభుత్వం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ (PPT) ఇవ్వనున్న నేపథ్యంలో, ప్రతిపక్షంగా తమకు కూడా పీపీటీ ఇచ్చే అవకాశం కల్పించాలని హరీష్ రావు కోరారు. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని, వాస్తవాలను సభ ముందు ఉంచే హక్కు తమకు ఉందన్నారు. అలాగే, ఉదయం 10:30 గంటలకు సభ ప్రారంభమైతే.. తెల్లవారుజామున 3 గంటలకు ఎజెండా ఇవ్వడం ఏంటని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇది సరైన సంప్రదాయం కాదని, ఎమ్మెల్యేలు అంశాలను ఎలా చదువుకుంటారని ప్రశ్నించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
