మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగ పర్వదినాల్లో మొదటి రోజైన ‘భోగి’ (జనవరి 13) రానే వచ్చింది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ, నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుపుకునే ఈ పండుగకు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పాత బాకీలు, బాధలు, కష్టాలను భోగి మంటల్లో వేసి, కొత్త ఆశలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఈ పర్వదినాన.. మీ స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపేందుకు మన పత్రిక ప్రత్యేకమైన కోట్స్, విషెస్‌ను అందిస్తోంది.
భోగి పండుగ విశిష్టత.. కొత్త వెలుగుల ఆరంభం సంక్రాంతి సంబరాలకు నాంది ఈ భోగి పండుగ. “భోగం” అంటే అనుభవించడం, సుఖం అని అర్థం. ఏడాది పాటు పడిన కష్టాలను మరిచిపోయి, సుఖసంతోషాలను అనుభవించే రోజుగా దీనిని పరిగణిస్తారు. తెల్లవారుజామునే లేచి, పాత వస్తువులను, కట్టెలను వేసి భోగి మంటలు వేయడం ఆనవాయితీ. ఇది కేవలం చలిని తరిమికొట్టడమే కాదు, మనలోని బద్ధకాన్ని, అజ్ఞానాన్ని, పాత ఆలోచనలను అగ్ని దేవుడికి ఆహుతి చేసి.. కొత్త ఉత్సాహంతో ముందుడుగు వేయాలనే సందేశాన్ని ఇస్తుంది. ఈ రోజున పిల్లలకు భోగి పళ్లు పోయడం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం సాంప్రదాయం. మరి ఇంతటి విశిష్టమైన రోజున మీ మనసులోని భావాలను మీ ప్రియమైన వారికి ఈ కింది సందేశాల ద్వారా తెలియజేయండి.
కవితాత్మక శుభాకాంక్షలు.. మీ బంధువుల కోసం సాంప్రదాయ బద్ధంగా, కాస్త కవితాత్మకంగా శుభాకాంక్షలు చెప్పాలనుకునే వారి కోసం ఇవి సరిగ్గా సరిపోతాయి:
- “భోగ భాగ్యాలను ఇచ్చే భోగి, సరదాలను తీసుకొచ్చే సంక్రాంతి, కమ్మనైన కనుమ.. మీ ఇంట కొత్త వెలుగులను నింపాలని మనసారా కోరుకుంటున్నాను. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.”
- “ఉత్తరాయణ పుణ్యకాలాన్ని తెచ్చే మకర సంక్రమణం, జనులకి వెలుగునిచ్చే రవికిరణం.. హ్యాపీ భోగి 2026!”
- “భోగి భోగ భాగ్యాలతో, సంక్రాంతి సిరిసంపదలతో, కనుమ కనువిందుగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ భోగి!”
స్నేహితులకు పంపే స్పెషల్ మెసేజ్‌లు స్నేహితులకు వాట్సాప్ స్టేటస్ లేదా మెసేజ్ ద్వారా విషెస్ చెప్పడానికి ఈ కోట్స్ బాగుంటాయి:
- “కష్టాలను దహించే భోగి మంటలు, భోగాలను అందించే భోగి పండ్లు, వాకిట్లో అందమైన రంగవల్లులు, కీర్తనలు పాడే హరిదాసులు, గుమగుమలాడే పిండి వంటలు.. ఇలా ఎప్పటికీ మీకు ఉండాలి సంతోషాలు. అందరికీ భోగి శుభాకాంక్షలు!”
- “భోగి మంటల్లో గత సంవత్సరం బాధలు, కష్టాలన్నీ కాలిపోయి, కొత్త సంవత్సరం ఆనందాలు రావాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు భోగి శుభాకాంక్షలు.”
- “ఈ భోగి పండుగ మీకు, మీ కుటుంబ సభ్యులకు సంతోషాలు, ఆనందాలు అందివ్వాలని కోరుకుంటున్నాను.. భోగి పండుగ 2026 శుభాకాంక్షలు.”
ఆశావహ దృక్పథంతో కూడిన కోట్స్ కొత్త ఏడాదిలో స్ఫూర్తిని నింపేలా శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే ఇవి ఎంచుకోండి:
- “భోగి మంటల వెలుగులు జీవితంలోని చీకటిని తొలగించి, ప్రకాశవంతమైన జీవితాన్ని ఇవ్వాలని, కొత్త సంవత్సరంలో కొత్త ఆరంభాలను తీసుకురావాలని ఆశిస్తున్నాను… భోగి పండుగ శుభాకాంక్షలు.”
- “గత సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీ జీవితంలో ఆనందం ఉండాలని, ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలను ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను… భోగి పండుగ శుభాకాంక్షలు.”
- “నూతన ప్రారంభానికి ఒక శుభదినం, అదృష్టాన్ని, భోగభాగ్యాలను అందించే పర్వదినం.. మీ జీవితం సిరిసంపదలతో విరజిల్లాలని ఆకాంక్షిస్తున్నాను.. భోగి శుభాకాంక్షలు.”
సింపుల్ & స్వీట్ మెసేజ్‌లు
- “మీ ఇల్లు ఆనందంతో కలకల్లాడాలని, కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను.. భోగి పండుగ శుభాకాంక్షలు.”
- “భోగి రోజు మీ కష్టాలు మంటల రూపంలో కాలిపోవాలని కోరుకుంటున్నాను.. నిత్యం మీ ఇంట సంతోషాలు కురవాలని ఆశిస్తున్నాను… హ్యాపీ భోగి.”
- “గతానికి వీడ్కోలు పలుకుతూ, రేపటి జీవిత సంక్రాంతికి స్వాగతం పలికే భోగి పండుగ సందర్భంగా హ్యాపీ భోగి.”
- “భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా మీరు, మీ కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. భోగి శుభాకాంక్షలు.”
ఈ పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మన పత్రిక కోరుకుంటోంది.
సంక్రాంతి, కనుమ పండుగల విశేషాలను మా తదుపరి కథనాల్లో అందించనున్నాం.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
