Advertisement

GST 2.0 తర్వాత నవరాత్రిలో వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో రికార్డు

GST 2.0 సంస్కరణల ప్రభావం నవరాత్రి ( Navaratri ) పండుగ సీజన్‌లో వాహనాలు, ఎలక్ట్రానిక్స్ అమ్మకాల్లో రికార్డు వృద్ధిగా కనిపించింది. పన్ను రేట్లు తగ్గించడం వల్ల ధరలు తగ్గి, వినియోగదారుల కొనుగోలు శక్తి పెరిగింది. దీంతో కుటుంబాలు కొత్త వాహనాలు, గృహోపకరణాలు, ఫ్యాషన్ వస్తువులపై ఖర్చు చేయడం పెరిగింది.

ఆటోమొబైల్ ( Auto Mobiles ) రంగంలో మారుతి సుజుకి అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 100% పెరిగాయి. నవరాత్రి మొదటి 8 రోజుల్లోనే 1.65 లక్షల వాహనాలను డెలివరీ చేసింది. మొదటి రోజునే 30,000 కార్లను డెలివరీ చేయడం గత 35 ఏళ్లలో కంపెనీకి అత్యుత్తమ పనితీరు. మహీంద్రా & మహీంద్రా అమ్మకాలు 60% పెరిగాయి. హ్యుందాయ్‌లో ఎస్‌యూవీల వాటా 72% కి చేరుకుంది. టాటా మోటార్స్ 50,000కు పైగా వాహనాలను విక్రయించింది.

Advertisement

ఎలక్ట్రానిక్స్ రంగంలో హైయర్ అమ్మకాలు 85% పెరిగాయి. ₹2.5 లక్షల కంటే ఎక్కువ ధర ఉన్న 85-100 అంగుళాల టీవీలను దీపావళి నిల్వలను దాదాపుగా అమ్మేసింది. LG, Godrej Appliances వంటి సంస్థలు కూడా రెండంకెల వృద్ధి నమోదు చేశాయి. రిలయన్స్ రిటైల్ అమ్మకాలు 20-25% పెరిగాయి. విజయ్ సేల్స్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా కూడా బలమైన అమ్మకాలను చూపించాయి.

ఓనం, దుర్గా పూజ, దసరా వంటి పండుగలతో కూడిన సీజన్‌లో మొత్తం అమ్మకాలలో 40–45% వాటా ఉంటుంది. ఈ సీజన్‌లో పెరిగిన అమ్మకాలు జీఎస్టీ 2.0 సానుకూల ప్రభావాన్ని చూపిస్తున్నట్టే లెక్క.

Advertisement