Advertisement

ఎలాన్ మస్క్ గ్రోకీపీడియా – వికీపీడియాకు పోటీగా రెండు వారాల్లో లాంచ్

టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరో సంచలనం — వికీపీడియాకు పోటీగా “Grokipedia” త్వరలో అందుబాటులోకి తెస్తున్నారు. తన ఏఐ సంస్థ ఎక్స్‌ఏఐ ద్వారా దీన్ని లాంచ్ చేస్తారు. మరో రెండు వారాల్లో 0.1 బీటా వర్షన్ విడుదల కానుంది. గ్రోక్ చాట్‌బాట్ ఆధారంగా ఈ ప్లాట్‌ఫామ్ పనిచేస్తుంది.

ఇది వికీపీడియాలోని సమాచారాన్ని జల్లెడపడుతూ, నిజం-అబద్ధం, పాక్షికత-అసంపూర్ణత గుర్తించి మార్పులు చేస్తుంది. నిష్పాక్షికం, నిజాలు వెల్లడించడమే లక్ష్యం. సంప్రదాయ మీడియా, ప్రభుత్వ ప్రభావం లేకుండా కచ్చితమైన సమాచారం అందించాలని మస్క్ ఉద్దేశం.

Advertisement

ఇంకా వివరాలు త్వరలో వెలడి కానున్నాయి.

Advertisement