అక్టోబరు 7, 2025న భారత్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ కొత్త రికార్డులను నమోదు చేశాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతలు కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు గోల్డ్‌పై మొగ్గు చూపుతున్నారు. ఈ రోజు దేశవ్యాప్తంగా 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ. 1,20,780 నుంచి రూ. 1,20,930 వరకు ట్రేడ్ అయింది.
భారత మార్కెట్లో బంగారం ధరలు రోజు రోజుకీ పెరుగుతూ సరికొత్త స్థాయిలను తాకుతున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కొనసాగితే, బంగారం ధరలు రూ. 1.25 లక్షలు దాటే అవకాశం ఉంది. అయితే, డాలరు బలహీనత లేదా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే కొంత స్థిరత్వం కనిపించే అవకాశం ఉందని కూడా అంచనా.
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలరు బలపడటం, రూపాయి విలువ క్షీణించడం వంటివి పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా మారాయి. పెట్టుబడిదారులు గోల్డ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో డిమాండ్ మరింతగా పెరుగుతోంది.
Today Gold prices October 7 2025
- హైదరాబాద్: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- విజయవాడ: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- ఢిల్లీ: 24 క్యారెట్ – రూ. 1,20,930 | 22 క్యారెట్ – రూ. 1,10,860
- ముంబయి: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- వడోదరా: 24 క్యారెట్ – రూ. 1,20,830 | 22 క్యారెట్ – రూ. 1,10,760
- కోల్‌కతా: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- చెన్నై: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- బెంగళూరు: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- కేరళ: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
- పుణె: 24 క్యారెట్ – రూ. 1,20,780 | 22 క్యారెట్ – రూ. 1,10,710
Today Silver prices October 7 2025
- హైదరాబాద్: రూ. 1,67,100
- విజయవాడ: రూ. 1,67,100
- ఢిల్లీ: రూ. 1,56,100
- చెన్నై: రూ. 1,67,100
- కోల్‌కతా: రూ. 1,56,100
- కేరళ: రూ. 1,67,100
- ముంబయి: రూ. 1,56,100
- బెంగళూరు: రూ. 1,56,100
- వడోదరా: రూ. 1,56,100
- అహ్మదాబాద్: రూ. 1,56,100
అమెరికా, యూరప్ ప్రాంతాల్లో జియోపాలిటికల్ టెన్షన్లు పెరుగుతుండటంతో పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు. బంగారంతో పాటు వెండి రేట్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ముందు రోజుతో పోల్చితే కిలోకు రూ.100 వరకు పెరిగాయి.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

