మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: పసిడి ప్రియులకు సోమవారం (జనవరి 19) గట్టి షాక్ తగిలింది. బంగారం ధరలు ఆకాశాన్నంటుతూ సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తుతున్నారు. సోమవారం మార్కెట్‌లో 22 క్యారెట్ల 100 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.22,500 పెరగడం గమనార్హం. దీంతో ధరలు ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరాయి.
ఈరోజు (జనవరి 19) బంగారం ధరలు ఇలా.. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి:
- 22 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల (తులం) ధర రూ. 2,250 పెరిగి రూ. 1,34,050 లకు చేరింది. (100 గ్రాముల ధర రూ. 13,40,500).
- 24 క్యారెట్ల బంగారం: 10 గ్రాముల ధర రూ. 1,910 పెరిగి రూ. 1,45,690 లకు చేరింది. (100 గ్రాముల ధర రూ. 14,56,900).
మహిళలు ఎంతో ఇష్టపడే బంగారం.. ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి వారు కొనలేని పరిస్థితి నెలకొంది. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, కాకినాడలలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
