Advertisement

చిత్తూరు జిల్లాలోని బంగారు గనుల్లో తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు

మన పత్రిక: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులోని చిగురుగుంట-బి.సానత్తం పరిధిలో భారీగా Gold Deposits ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. ఈ ప్రాంతంలోని గనుల్లో సుమారు 12,500 కిలోల బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతంలో నిలిచిపోయిన ఈ గనుల్లో తవ్వకాలను మళ్లీ ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో రాబోయే ఈ-వేలంలో పాల్గొనడానికి ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (APMDC) సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఈ-వేలం ప్రక్రియ లేకుండానే ప్రత్యక్షంగా గనులను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు పూర్తి చేస్తోంది.

Advertisement
Advertisement