Advertisement

Ghaati Release Glimpse: ఘాటీ రిలీజ్ గ్లింప్స్ అనుష్క యాక్షన్ లుక్ అదరగొడుతోంది!

Ghaati Release Glimpse: ఘాటీ చిత్రం నుండి విడుదలైన లేటెస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను షాక్ కు గురిచేస్తోంది. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. భాగమతి తర్వాత అనుష్క నుండి వస్తున్న పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు.

Advertisement

ఇప్పటికే టీజర్, ట్రైలర్ లకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన యాక్షన్ గ్లింప్స్ మరింత సెన్సేషన్ సృష్టిస్తోంది. అనుష్క చేసిన స్టంట్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. రైల్వే బ్రిడ్జి నుండి దూకడం వంటి ప్రమాదకర సన్నివేశాలు ఆమె సొంతంగా చేసింది. డూప్స్ లేకుండా నటించడం ప్రత్యేకత.

Advertisement

ప్రభాస్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గ్లింప్స్ విడుదల చేశాడు. ఇంగ్లీష్ ర్యాప్ సాంగ్ తో ప్రారంభమయ్యే ఈ వీడియో ఉత్కంఠ నింపుతుంది. క్రిష్ స్టైల్ కాకుండా కొత్త యాంగిల్ లో చూపించడం ఆశ్చర్యపరుస్తోంది. అనుష్క చివర్లో చెప్పే “వాళ్ళు ఊరుకోరు… నేను ఊరుకోను” డైలాగ్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రం ఆరంభం నుండి ముగింపు వరకు గ్రిప్పింగ్ గా ఉంటే అరుంధతి స్థాయి హిట్ సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Advertisement

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement