Ghati movie review telugu: అనుష్క శెట్టి ( Anushka Shetty ) నటించిన ఘాటీ ( Ghaati ) సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐదేళ్ల తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ కూడా మంచి హైప్ క్రియేట్ చేశాయి.
సినిమా కథ ప్రకారం, ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లోని తూర్పు కొనసాగులో గంజాయి రవాణా చేసే సమూహం తర్వాత ఆ పని వదిలేస్తుంది. వారి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్న యాజమాన్యం దాడులకు పాల్పడుతుంది. ఈ క్రమంలో శీలావతి (అనుష్క) బాధితురాలు అవుతుంది. ఆమె ప్రతీకారం కోసం రంగంలోకి దిగి క్రిమినల్ నుంచి లెజెండ్ గా ఎలా మారుతుందో చూపించారు. సినిమాపై ట్విట్టర్ లో వచ్చిన రివ్యూల ప్రకారం, క్రిష్ తీసుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉంది. అనుష్క సినిమాను సింగిల్ హ్యాండెడ్ గా నడిపించింది. ఆమె చూపులతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. కాటేరమ్మ కోడలు, రెబల్ క్వీన్ అంటూ అభిమానులు బిరుదులు పెట్టారు.
అయితే సంగీతం మెరుగ్గా ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. కొన్ని చోట్ల లాగ్ అయిందని, సబ్ ప్లాట్లు క్లిష్టంగా అనిపించాయని పేర్కొంటున్నారు. క్రిష్ సినిమాల్లో ఉండే ఎమోషన్స్, డైలాగ్స్ ఈ సారి మిస్సయ్యాయని విమర్శలు వచ్చాయి. ఫస్టాఫ్ కంటే సెకండాఫ్ మెరుగ్గా ఉంది. చైతన్య రావు పాత్ర ఆకట్టుకుంది. పుష్ప స్థాయిలో రా అండ్ రస్టిక్ గా తీయాలనుకున్నా పూర్తి స్థాయిలో రీచ్ కాలేకపోయింది. ఓవర్సీస్ నుంచి కొంత నిరాశ రివ్యూలు వస్తున్నాయి. కానీ ఇండియాలో మాత్రం ఫర్వాలేదు అనే టాక్ నెలకొంది
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

