Advertisement

తెలంగాణలో ఈ నెల 6న సెలవు

మన పత్రిక, వెబ్​డెస్క్

తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6న (శనివారం) సెలవు ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఈ సెలవు వర్తిస్తుందని అధికారులు తెలిపారు. అక్టోబర్ 11న రెండో శనివారం పనిదినంగా పరిగణిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక ఏర్పాట్ల భాగంగా హైదరాబాద్ నగరంలో నిమజ్జనానికి సంబంధించి జీహెచ్ఎంసీ కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

గణేశ్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సుమారు 50 వేల గణేశ విగ్రహాలు నిమజ్జనం కానున్నట్లు అధికారులు అంచనా వేశారు. భక్తుల రద్దీని నివారించేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు, సెక్యూరిటీ బందోబస్తు చేపడుతున్నారు. ఈ సంవత్సరం గణేశ్ చతుర్థి ఉత్సవాలు భక్తి పరవశంతో జరుగుతున్నాయి. ప్రభుత్వం చేపట్టిన సెలవు ప్రకటన భక్తులకు ఉపశమనం కలిగించింది.

Advertisement