మన పత్రిక, హైదరాబాద్: ప్రముఖ నటుడు ఫహద్ ఫాజిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ (Don’t Trouble The Trouble). ఈ సినిమాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోమవారం ప్రకటించింది. శశాంక్ యేలేటి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్‌పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్.కార్తికేయ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రానికి ఎస్.ఎస్.రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. సోమవారం విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కొత్త తరహా ఫాంటసీ డ్రామా (Fantasy Drama) అంశాలతో తెరకెక్కినట్లు దర్శకుడు తెలిపారు. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు. ఫహద్ ఫాజిల్ తొలిసారిగా తెలుగులో నేరుగా ఒక చిత్రంలో నటిస్తుండటం విశేషం.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- మార్కెట్లోకి వచ్చిన వివో Y05e బడ్జెట్ స్మార్ట్‌ఫోన్: ఫీచర్లు ఇవే
- హైసెన్స్ A10: వినూత్నమైన డిటాచబుల్ డ్యూయల్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ విడుదల
- పోలవరం ప్రాజెక్టు పూర్తికి గడువు నిర్ణయించిన సీఎం చంద్రబాబు
- శేఖర్ మాస్టర్‌తో విభేదాలపై స్పందించిన జానీ మాస్టర్
- ప్రభాస్ చేతుల మీదుగా వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు టీజర్ విడుదల
