Advertisement

TG News: సర్పంచ్‌ల స్వీకారం వాయిదా.. డిసెంబర్ 22న బాధ్యతల స్వీకరణ.

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్‌ల పదవీ బాధ్యతల స్వీకరణ (Appointment Day) తేదీలో మార్పు చోటుచేసుకుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 20న ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉండగా, దానిని డిసెంబర్ 22వ తేదీకి వాయిదా వేస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ తాజా ఉత్తర్వులు జారీ చేసింది.

కారణం ఇదే: డిసెంబర్ 20న మంచి ముహూర్తాలు లేకపోవడంతో, తేదీని మార్చాలని పలువురు ఎన్నికైన ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. వారి కోరిక మేరకు స్పందించిన అధికారులు, కొత్త తేదీని డిసెంబర్ 22గా ఖరారు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నూతన సర్పంచ్‌లందరూ అదే రోజున తమ పదవీ బాధ్యతలను స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Advertisement
Advertisement