Advertisement

తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. జాబితా ఇదే

మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం కీలక బదిలీలు చేపట్టింది. అదనపు ఎస్పీ (ఏఎస్పీ) హోదాలో ఉన్న 9 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు ఈ మేరకు అధికారిక ఆదేశాలు వెలువరించారు.

పరిపాలనా సౌలభ్యం, మెరుగైన పోలీసింగ్, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ బదిలీలు చేపట్టినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. బదిలీ అయిన అధికారులంతా తక్షణమే తమ కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాల్లో పేర్కొంది.

Advertisement

బదిలీ అయిన ఐపీఎస్ (ఏఎస్పీ) అధికారుల జాబితా

అధికారి పేరుపాత పోస్టింగ్కొత్త పోస్టింగ్
బొక్కా చైతన్యరెడ్డికామారెడ్డి ఏఎస్పీసంగారెడ్డి అదనపు ఎస్పీ
పందిరి చేతన్‌ నితిన్‌జనగామ ఏఎస్పీజగిత్యాల ఏఎస్పీ
విక్రాంత్‌కుమార్‌ సింగ్‌భద్రాచలం ఏఎస్పీమెదక్ ఏఎస్పీ
నగ్రాలె శుభమ్‌ ప్రకాశ్‌వరంగల్ ఏఎస్పీనిజామాబాద్ అదనపు డీసీపీ
రాజేశ్‌ మీనాభైంసా అదనపు ఎస్పీవనపర్తి ఏఎస్పీ
ఎస్‌.చిత్తరంజన్‌ఆసిఫాబాద్‌ ఏఎస్పీఆసిఫాబాద్‌ అదనపు ఎస్పీ (అడ్మిన్‌)
పి.మౌనికఆదిలాబాద్‌ ఏఎస్పీఆదిలాబాద్‌ అదనపు ఎస్పీ (అడ్మిన్‌)
పత్తిపాక సాయికిరణ్‌నిర్మల్‌ ఏఎస్పీభైంసా ఏఎస్పీ (ఎస్‌డీపీఓ)
రుత్విక్‌సాయివేములవాడ ఏఎస్పీఉట్నూర్‌ ఏఎస్పీ (ఎస్‌డీపీఓ)
Advertisement