టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అయిన క్రేజీ సినిమాల్లో “డ్యూడ్” (Dude) ఒకటి. లవ్ టుడే, డ్రాగన్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా, మమితా బైజు (Mamitha) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజే థియేటర్లలో రిలీజ్ అవగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
కథ విషయానికి వస్తే.. ఒకరితో లవ్ లో ఫెయిల్ అయిన గగన్ (ప్రదీప్ రంగనాథన్) కుందన (మమితా బైజు) ప్రేమని కూడా రిజెక్ట్ చేస్తాడు. పైగా కుందన గగన్ కి మరదలు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలతో గగన్ మళ్ళీ మరదలితో ప్రేమలో పడతాడు. నేరుగా వెళ్లి మావయ్యకి చెప్తే, వాళ్ళ పెళ్ళికి ఒకే చెప్పి పెళ్లి కూడా చేస్తాడు. అయితే వీళ్ళ పెళ్ళికి మధ్యలో కొన్ని ప్రాబ్లెమ్స్ కూడా వస్తాయి. ఆ ప్రాబ్లెమ్స్ ఏంటి? కుందన ప్రేమ కోసం గగన్ ఏం చేసాడు.. అనేది సినిమా మూల కథ.
“డ్యూడ్” సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ప్రదీప్ రంగనాథన్. తన సూపర్ పెర్ఫార్మన్స్ తో సినిమాని ముందుకు నడిపించాడు. డైరెక్టర్ కీర్తిశ్వరన్ మొదటి సినిమా అయినా చక్కగా హ్యాండిల్ చేసాడు. పెద్దగా ల్యాగ్ చేయకుండా మంచి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నాడు. అలాగే మ్యూజిక్ పర్వాలేదనిపించింది. ఇక మైత్రి నిర్మాతలు ఎక్కడా తగ్గకుండా సినిమాని మించి టెక్నికల్ వ్యాల్యూస్ తో రిచ్ గా తెరకెక్కించారు.
ఓవరాల్ గా “డ్యూడ్” సినిమాతో ప్రదీప్ రంగనాథన్ మరో డీసెంట్ సక్సెస్ ని అందుకోవడం ఖాయం అనిపిస్తుంది. ఆడియన్స్ కి కూడా ఈ వారం సినిమాల్లో వన్ అఫ్ ది బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుందని చెప్పొచ్చు.
రేటింగ్ 3/5
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
