మన పత్రిక, దుబాయ్: అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో క్షిపణి శకలాలు పడటంతో భద్రతా కారణాల దృష్ట్యా విమానాశ్రయ కార్యకలాపాలను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. యుద్ధ వాతావరణం కారణంగా గల్ఫ్ దేశాల గగనతలాన్ని మూసివేయడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయాల్లోనే చిక్కుకుపోయారు.
దుబాయ్‌లోని మెరీనా, అల్ సుఫూహ్ వంటి నివాస ప్రాంతాలతో పాటు ప్రధాన ఆర్థిక కేంద్రాల్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. తమ గగనతలంలోకి దూసుకొచ్చిన 9 బాలిస్టిక్ క్షిపణులు, 33 డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్నట్లు యూఏఈ ప్రకటించింది. అయితే, బుర్జ్ అల్ అరబ్ కట్టడం సమీపంలో శకలాలు పడి స్వల్ప నష్టం వాటిల్లింది.
మరోవైపు, కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇంధన ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేయడంతో ఆస్తి నష్టం సంభవించడంతో పాటు రన్ వే దెబ్బతిన్నట్లు సమాచారం. కువైట్‌లోని అహ్మద్ అల్-జాబర్ ఎయిర్ బేస్‌పై జరిగిన డ్రోన్ల దాడిలో పలువురు సైనికులు గాయపడినట్లు ఆ దేశ రక్షణ శాఖ ధ్రువీకరించింది. ఇరాన్‌లోని ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడులకు ప్రతీకారంగానే, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్ జీసీ) స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి :
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- సినిమాను దెబ్బతీయడానికే మోనాలిసా పెళ్లి: దర్శకుడు సనోజ్
- Medchal HIV Injection 2026: యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన యువకుడి అరెస్టు
- Gold Rate Today – March 15, ఆదివారం బంగారం ధరలు!
- NHPC Trainee Engineer Recruitment 2026: ఎన్‌హెచ్‌పీసీలో 81 ట్రైనీ ఇంజనీర్ పోస్టుల భర్తీ
