మన పత్రిక, వెబ్డెస్క్: హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ (DRDL) నూతన డైరెక్టర్‌గా ప్రఖ్యాత శాస్త్రవేత్త అంకతి రాజు (Ankathi Raju DRDL) నియమితులయ్యారు. ఆయన ఇండియన్ మిస్సైల్ డెవలప్‌మెంట్ ల్యాబొరేటరీ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.
అంకతి రాజు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ, ఐఐటీ బాంబే నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ప్రొపల్షన్)లో ఎంటెక్ పూర్తి చేశారు. గత మూడు దశాబ్దాలుగా, పృథ్వీ, అగ్ని, మిషన్ శక్తి వంటి క్షిపణుల లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్‌ల రూపకల్పనలో ఆయన కీలకపాత్ర పోషించారు.
గతంలో ఆర్నమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) డైరెక్టర్‌గా, గైడెడ్ పినాక అభివృద్ధికి ఆయన నాయకత్వం వహించారు. రాజు డీఆర్‌డీవో అగ్ని ఎక్సలెన్స్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వ ఉత్తమ శాస్త్రవేత్త అవార్డులను అందుకున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News

